News September 10, 2024

ADB: ‘క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు’

image

క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 10 ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక రిమ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు. ఆత్మహత్యలకు పాల్పడటం వల్ల వారి కుటుంబాలు చిన్న భిన్నమవుతాయన్నారు. ఉచిత కౌన్సెలింగ్ కొరకు 14416 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News October 20, 2025

ADB: గుస్సాడీ వేషధారణలో అదరగొట్టిన బాలుడు

image

భీంపూర్ మండలంలోని వాడేగామ గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు కాత్లే ఉమేష్ ఆదివాసీల గుస్సాడీ వేషధారణలో అదరగొట్టాడు. ఎంత ఆధునికత వచ్చినా, సంస్కృతిని కాపాడుకోవడంలో ఆదివాసీలు ముందున్నారని, ఈ బాలుడి రూపంలో వారసత్వం తరాలుగా ప్రవహిస్తోందని స్థానికులు కొనియాడారు. ఈ గుస్సాడీ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది.

News October 19, 2025

ఇంద్రవెల్లి: దండారీ ఉత్సవాలు పాల్గొన్న ADB ఎస్పీ

image

ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా దండారీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏత్మాసూర్‌పెన్‌కు ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేశారు. అదివారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఏర్పాటు చేసిన గుస్సాడీ దండారీ ఉత్సవాలకు జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఉట్నూర్ ప్రసాద్ హాజరయ్యారు. గుస్సాడీలతో కలసి కోలాటం ఆడుకున్నారు.

News October 19, 2025

దీపావళి శాంతియుతంగా జరుపుకోండి: ADB కలెక్టర్

image

దీపావళి వెలుగుల పండుగగా ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. గిరిజనుల సాంప్రదాయ పండుగ దండారి గుస్సాడి సందర్భంగా గిరిజన సోదరులు, కళాకారులకు కలెక్టర్ రాజర్షి షా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ పండుగలను శాంతి, ఐకమత్యం, సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.