News January 29, 2025
ADB: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దుబార పేట గ్రామానికి చెందిన ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘానికి బుక్ అఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించిందని ఆదివాసీ సకల కళా సంక్షేమ డైరెక్టర్ కాత్లే శ్రీధర్ పేర్కొన్నారు. దిల్లీలో నిర్వహించిన జయతి జయతి జయ మామ భారతం అనే నృత్య కార్యక్రమంలో తెలంగాణ తరఫున పాల్గొన్న నృత్య బృందానికి ఈ ఘనత దక్కిందని తెలిపారు.
Similar News
News November 26, 2025
విభిన్న ప్రతిభావంతులు రాణించాలి: డీఈఓ

విభిన్న ప్రతిభావంతులు తాము ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో సాధన చేసి రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. బుధవారం కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సమన్వయంతో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి, విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.
News November 26, 2025
వైరల్ అయ్యాక అసభ్యకర మెసేజ్‌లు వచ్చాయి: నటి

ఆకర్షణీయమైన లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరలయిన తర్వాత తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు వచ్చాయని నటి గిరిజా ఓక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఆ ఇంటర్వ్యూ తర్వాత నాకు ఆఫర్లేమీ రాలేదు. కానీ చాలా మంది మెసేజ్‌లు పంపారు. ఒక అవకాశం ఇస్తే మీ కోసం ఏదైనా చేస్తానని.. వాళ్లతో గంట గడిపేందుకు రేటు ఎంతో చెప్పాలని కొందరు అభ్యంతరకర మెసేజ్‌లు పంపారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News November 26, 2025
GNT: ఈ పరిస్థితి మీ ప్రాంతంలో కూడా ఉందా.?

ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పలువురు నాయకులు సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు. ఇతర పార్టీలకు చెందినవారు అధికార పార్టీ వైపు క్యూ కడుతున్నారు. గతంలో వ్యతిరేకంగా పనిచేసినవారె, ఇప్పుడు కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు స్థానికంగా ప్రచారం సాగటంతో, మళ్లీ వారికే ప్రాముఖ్యత వస్తె తమ పరిస్థితి ఏమిటని? కూటమి వాపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.


