News November 7, 2024
ADB: గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న పార్ట్ టైం ఉపాధ్యాయ పోస్టులకు ఉట్నూర్లోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్సీఓ ఓ ప్రకటన విడుదల చేశారు. టీజీటీ సామాన్య శాస్త్రం 3, ఇంగ్లిష్ 3, పీజీటీ భౌతిక శాస్త్రం 1, వృక్ష, భౌతిక, ఆర్థిక, వాణిజ్యశాస్త్రాల్లో ఒక్కో లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. బాలికల పాఠశాలల్లో మహిళలతోనే భర్తీ చేస్తామన్నారు.
Similar News
News November 25, 2024
దహేగాంలో ట్రాక్టర్ కింద పడి ఐదేళ్ల బాలుడు మృతి
ట్రాక్టర్ కింద పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన దహేగాం మండలంలో చోటుచేసుకుంది. దేవాజిగూడకు చెందిన కృష్ణయ్య, వనిత దంపతుల కుమారుడు రిషి (5) ఆదివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా పత్తి లోడ్తో వస్తున్న ట్రాక్టర్ టైర్ బాలుడి పైనుంచి వెళ్లడంతో రిషి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
News November 25, 2024
నర్సాపూర్(జి)లో 11ఏళ్ల బాలికపై లైంగికదాడికి యత్నం
బాలిక(11)పై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి యత్నించిన ఘటన నర్సాపూర్ (జి)లో ఆదివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బాలికకు తామర పువ్వులు కోసి ఇస్తామని చెప్పి బసంత చెరువు వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారు. ఆమె అరవడంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు SI వెల్లడించారు.
News November 25, 2024
చెన్నూర్: మాలలు ఐక్యంగా ఉద్యమించాలి: ఎమ్మెల్యే వివేక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఆదివారం జరిగిన మాలల మహా గర్జన సభకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా మాలలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.