News February 5, 2025
ADB: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

అన్ని గురుకులాలలో 5-9 తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈనెల 6 వరకు ప్రభుత్వం పొడిగించిందని ఆదిలాబాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ లలిత కుమారి తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్‌లో నమోదుచేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్షలో కనబర్చిన ప్రతిభ విద్యార్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలల ప్రాధాన్యత ప్రకారం ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
ADB: రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా జమునా నాయక్

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని దానోరా (బి) సర్పంచ్ జాదవ్ జమునా నాయక్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సర్పంచుల సంఘం బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. క్రమశిక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధికై తోడ్పాటు చేస్తానని జమునా నాయక్ పేర్కొన్నారు.
News January 12, 2026
ఆదిలాబాద్: 19న కలెక్టరేట్ ఎదుట ధర్నా

ఈ నెల 19వ తేదీన ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ సభ్యుడు జాదవ్ సోమేశ్ తెలిపారు. నిరుద్యోగుల కోసం 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే డిమాండుతో నిరసన చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలోని నిరుద్యోగ యువత హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.