News March 28, 2025

ADB: గొంతు కోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

ఆదిలాబాద్‌లో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కేఆర్కే కాలనీకి చెందిన నితిన్ మసూద్ చౌక్ సమీపంలో గురువారం బ్లేడ్‌తో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న 1-టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్ఐ అశోక్ రిమ్స్‌కు చేరుకొని ఘటనపై ఆరా తీశారు.

Similar News

News November 20, 2025

Alert: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు

image

AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని APSDMA తెలిపింది. తర్వాత 48 గంటల్లో మరింత బలపడుతుందని పేర్కొంది. నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని తెలిపింది.

News November 20, 2025

‘1600’ సిరీస్‌తోనే కాల్స్.. ట్రాయ్ కీలక ఆదేశాలు

image

దేశంలో పెరిగిపోతున్న స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సంస్థలు తమ సర్వీసు, లావాదేవీల కాల్స్ కోసం 1600తో మొదలయ్యే నంబర్ సిరీస్‌ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు జనవరి 1 నాటికి, పెద్ద NBFCలు, పేమెంట్స్ బ్యాంకులు ఫిబ్రవరి 1 కల్లా, మిగతా NBFCలు, సహకార బ్యాంకులు, RRBలు మార్చి 1 లోపు ఈ సిరీస్‌‌కు మారాల్సి ఉంది.

News November 20, 2025

తిరుపతి: ఆ ఖాతాల్లో రూ.112.42 కోట్ల నగదు.!

image

తిరుపతి కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ డా.వెంకటేశ్వర్ JC మౌర్యతో కలిసి ‘మీడబ్బు–మీహక్కు’ పోస్టర్ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 3 నెలల పాటు క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, బీమా పాలసీలు వంటి ఆర్థిక ఆస్తులను లబ్ధిదారులు తిరిగి పొందేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇలాంటి 5,50,632 ఖాతాల్లో రూ.112.42 కోట్ల నిల్వలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.