News November 7, 2024
ADB: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
Similar News
News July 5, 2025
సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: ADB ఎస్పీ

ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ సిబ్బందికి సూచించారు. శనివారం ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన పరేడ్‌లో పాల్గొని సూచనలు చేశారు. సిబ్బంది ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ప్రతి వారం నిర్వహించే పరేడ్‌లో పాల్గొని నిర్వహించే కవాతులో పరిపూర్ణత చెందాలన్నారు.
News July 5, 2025
ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్ బదిలీ

ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్ ఆకస్మిక బదిలీ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఎన్నికల నిర్వహణతో పాటు రెవెన్యూ సదస్సుల విజయవంతంలోనూ కీలకపాత్ర పోషించారు. అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని (PRRD) విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News July 5, 2025
ADB: బాలలను పనిలో పెట్టుకున్న ముగ్గురిపై కేసు నమోదు

బాలలను పనిలో పెట్టుకున్న ముగ్గురిపై శుక్రవారం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదిలాబాద్ మదీనా హోటల్‌లో బాల కార్మికుడితో పని చేయించుకుంటున్న యజమాని అబ్దుల్ హసీబ్‌పై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. అదేవిధంగా మాంసం దుకాణ యజమాని ప్రవీణ్, మదీనా బెడ్ వర్క్ యజమాని షేక్ ఫరీద్‌పై కార్మిక శాఖ అధికారి శంకర్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు 1 టౌన్ సీఐ సునీల్ చెప్పారు.