News December 15, 2024
ADB: గ్రూప్-2అభ్యర్థులకు కీలక సూచన
ఉమ్మడి జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదిలాబాద్‌లో 63 కేంద్రాల్లో 10,428, ఆసిఫాబాద్‌లో 18 కేంద్రాల్లో 4,389, నిర్మల్‌లో 24 కేంద్రాల్లో 8,080, మంచిర్యాలలో 48 కేంద్రాల్లో14,951 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిమిషం నిబంధన అమలులో ఉంది. అభ్యర్థులు సమయానికి కేంద్రాల వద్దకు చేరుకోవాలని, అరగంట ముందే గేట్లు మూసివేస్తారని అధికారులు స్పష్టం చేశారు.
Similar News
News January 26, 2025
ADB: నాగోబా స్పెషల్.. ఎందరొచ్చినా 22 పొయ్యిలే
ఆదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. జాతరకు మెస్రం వంశీయులు వేలాదిగా తరలివస్తారు. కానీ వారు వంట చేసుకోవడానికి అక్కడ 22 పొయ్యిలను మాత్రమే వినియోగిస్తారు. అయితే ఈ పొయ్యిలను ఎక్కడపడితే అక్కడ పెట్టరు. ఆలయ ప్రాంగణంలోని గోడ లోపల వెలిగే దీపాలు వెలుగుల్లో మాత్రమే వాటిని ఏర్పాటు చేస్తారు. వంట పాత్రలు, వాటి మీద కప్పడానికి మూతలను సిరికొండలోని గుగ్గిల్ల వంశస్థులు తయారు చేస్తారు.
News January 26, 2025
ADB: బ్యాంకు లాకర్‌లో బంగారం ఆభరణాలు మాయం
ఆదిలాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్‌లో నుంచి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల బ్యాంకు ఉన్నతాధికారులు సాధారణ తనిఖీలు చేపట్టగా, బ్యాంకు లాకర్‌లో నుంచి 507.4 గ్రాముల బంగారు ఆభరణాలు మిస్సైనట్లు తనిఖీల్లో తేలింది. వీటి విలువ రూ. 29 లక్షల 20 వేలు ఉంటుంది. బ్యాంకు అధికారుల ఆదేశాల మేరకు బ్రాంచ్ మేనేజర్ గోవర్ధన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News January 26, 2025
ఇంద్రవెల్లి: పాము కాటుతో రైతు మృతి
పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మసాగర్‌కు చెందిన రైతు సాబ్లె గురుసింగ్ (60) పాము కాటుకు గురై మృతి చెందాడు. శనివారం చేనులో పని చేస్తుండగా పాము కాటు వేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.