News April 9, 2025
ADB: ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
Similar News
News November 21, 2025
ADB: రైతులందరికీ జోగురామన్న కృతజ్ఞతలు

ఆదిలాబాద్ జిల్లా రైతులందరికీ మాజీ మంత్రి జోగు రామన్న కృతజ్ఞతలు తెలిపారు. ఆఖిలపక్ష రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పార్టీని మరింత బలోపేతం చేస్తూ రైతులందరికీ న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడటానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
News November 21, 2025
BREAKING: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. కాజల్ సింగ్ ఇదివరకు ఉట్నూర్ ఎస్డీపీవోగా, మౌనిక ఇదివరకు దేవరకొండ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
News November 21, 2025
ADB: డిసెంబర్లో TCA రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు TCA రాష్ట్ర సభ్యురాలు, జడ్పీ మాజీ ఛైర్పర్సన్ చిట్యాల సుహాసిని తెలిపారు. ఈ పోటీలు జిల్లా, జోనల్ స్థాయిలో తరువాత రాష్ట్ర స్థాయిలో ఉంటాయని వివరించారు. అండర్ 23తో పాటు 23ఏళ్ల వారికి నలుగురు క్రీడాకారులకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఆమెతో పాటు జోనల్ ఇన్ఛార్జ్ నరోత్తమ్ రెడ్డి ఉన్నారు.


