News April 9, 2025
ADB: ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
Similar News
News October 21, 2025
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు

లక్ష్మీదేవిపల్లి మండలం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నందు పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది వసతి గృహాలను, గార్డ్ రూములను భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా హెడ్‌క్వార్టర్స్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ, పోలీస్ శాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
News October 21, 2025
ఒంబ్రొఫోబియా: వర్షం అంటే వణుకే!

కొందరికి వర్షం అంటే భయం. దాన్ని ఒంబ్రొఫోబియా అంటారు. పిల్లలు, టీనేజర్లకు ఈ ఫోబియా ఎక్కువగా ఉంటుంది. వీరు పదే పదే వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకుంటారు. వర్షం పడితే ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఇంటినుంచి బయటకు వెళ్లరు. వర్షం ఆగినా కొన్ని గంటల పాటు ఇంటికే పరిమితమవుతారు. గుండె దడ, వణుకు, భయం, ఛాతినొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫోబియాకు ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు.
News October 21, 2025
HYD: BRS నేతల మాటలు హాస్యాస్పదం: మంత్రి

మాఫియా, డాన్లు, కాంట్రాక్టులు, కమీషన్ల గురించి BRS నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. బ్లాక్ మెయిలింగ్ చేయడంలో బాల్క సుమన్ దిట్ట అని విమర్శించారు. RS ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ మంత్రుల గురించి మాట్లాడే ముందు KCR పదేళ్ల పాలనపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. KCR హయాంలో గురుకులాలు అస్తవ్యస్తంగా అయ్యాయన్నారు.