News March 5, 2025
ADB: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మందికి గాయాలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం గిరిజ గ్రామానికి చెందిన 16 మంది మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బుధవారం మహారాష్ట్రలోని కోర్పణ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News December 13, 2025
NLG: కాంగ్రెస్ 377, బీఆర్ఎస్ 186, బీజేపీ 9

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 60 శాతం సర్పంచి స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 630 గ్రామాలకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 377 స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ మద్దతు కలిగిన అభ్యర్థులు 186 సర్పంచ్ స్థానాలును గెలుచుకున్నారు. సీపీఎం, సీపీఐ అభ్యర్థులు 11 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 9 స్థానాలకే పరిమితమైంది.
News December 13, 2025
KMR: సర్పంచ్ పోరులో యువత.. రేపటి భవిష్యత్తుకై

కామారెడ్డి జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రేపు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో యువత, మహిళలు విజయదుందుభి మ్రోగించగారు. రేపటి రెండవ విడత ఎన్నికల్లో పోరులో నిలిచిన యువత రాజకీయంగా తమ స్థానాలను కొంగ్రొత్త ఆశలతో రాణిస్తారో లేదో చూడాలి. దేశ, రాష్ట్ర రాజకీయ నాయకులను పరంపరను పుణికిపుచ్చుకుంటున్న యువత రేపటి భవిష్యత్తుకై తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు.
News December 13, 2025
NZB: రెండవ విడత GP ఎన్నికల పోలింగ్ వివరాలు

పోలింగ్ సమయం: ఉదయం7గంటల నుంచి 1 గంట వరకు
*మొత్తం సర్పంచ్ స్థానాలు: 196
*ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ స్థానాలు: 38
*ఎన్నికలు జరుగనున్న సర్పంచ్ స్థానాలు:158
*పోటీలో ఉన్న అభ్యర్ధులు: 568
*మొత్తం వార్డు స్థానాలు: 1760
*ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డులు: 674
*ఎన్నికలు జరుగనున్న వార్డులు:1081
*పోటీలో ఉన్న అభ్యర్ధులు : 2634
*ఓటర్ల సంఖ్య: 2,38,838
*పోలింగ్ కేంద్రాలు : 1476


