News March 5, 2025
ADB: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మందికి గాయాలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం గిరిజ గ్రామానికి చెందిన 16 మంది మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బుధవారం మహారాష్ట్రలోని కోర్పణ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News March 6, 2026
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం: GNT కలెక్టర్

గుంటూరు జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు RAMP ద్వారా నైపుణ్యాభివృద్ధి వర్క్‌షాప్‌లు నిర్వహించాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా వచ్చే దరఖాస్తులకు నిర్ణీత గడువు (SLA) లోపే అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.
News March 6, 2026
నిర్మల్ జిల్లాలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత

నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలలో నమోదు కావాల్సిన గరిష్ట ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదు అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో శుక్రవారం 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత భైంసా మండలంలో నమోదు కాగా, అత్యల్పంగా కుంటాలలో 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 6, 2026
ఎస్సీ వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది: సీఎం రేవంత్

TG: సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత SC వర్గీకరణపై ప్రకటన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని CM రేవంత్ చెప్పారు. HYDలో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మీవైపే నిలబడ్డాను. భారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్స్ కర్ణుడు, బర్బరీకుడు. కర్ణుడి మాదిరిగా మాదిగల విషయంలో మిత్ర ధర్మం పాటిస్తూ బర్బరీకుడిలా పనిచేశా’ అని తెలిపారు.


