News March 5, 2025
ADB: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మందికి గాయాలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం గిరిజ గ్రామానికి చెందిన 16 మంది మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బుధవారం మహారాష్ట్రలోని కోర్పణ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News November 13, 2025
GWL: అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి

జిల్లావ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్లో ఉన్న పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం ఐడీఓసీ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్, ఎన్ఆర్ఈజీఎస్, ఆర్థిక సంఘం నిధులతో ఆయా కేంద్రాల్లో మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్ తదితర పనులు ఎందుకు పూర్తి కాలేదన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించి డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలన్నారు.
News November 13, 2025
GWL: నిరుద్యోగులకు జాబ్ మేళా- ప్రియాంక

గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీల్లో శిక్షణ ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డాక్టర్ ప్రియాంక గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14న ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 2:00 వరకు ఐడిఓసిలోని F-30/1 బ్లాక్లో నిర్వహిస్తామని తెలిపారు. SSC, ఇంటర్, డిగ్రీ చదివిన 18 నుంచి 35 సంవత్సరాలు వయసు గలవారు హాజరు కావాలన్నారు.
News November 13, 2025
జిల్లాలో వారిపై నిఘా ఉంచాలి: అనకాపల్లి ఎస్పీ

జిల్లాలో తరచూ నేరాలకు పాల్పడుతున్న నేరస్తులపై నిఘా ఉంచాలని ఎస్పీ తుహీన్ సిన్హా పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. గత నెలలో నమోదైన నేరాలు, కేసుల దర్యాప్తు, పురోగతి, పెండింగ్ వారెంట్లుపై ఆరా తీశారు. ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్తో సమన్వయం కొనసాగిస్తూ కేసులలో శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.


