News March 5, 2025
ADB: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మందికి గాయాలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం గిరిజ గ్రామానికి చెందిన 16 మంది మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బుధవారం మహారాష్ట్రలోని కోర్పణ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News December 14, 2025
బాపట్ల: జిల్లాస్థాయి ఖో..ఖో పురుషుల జట్టు ఎంపిక

పంగులూరు మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల వద్ద ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి ఖో..ఖో పురుషుల జట్టును శనివారం ఎంపిక చేసినట్లు ఖో..ఖో భారత సమాఖ్య ఉపాధ్యక్షుడు సీతారామరెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఈ జట్టు ఈనెల 24, 25, 26 తేదీల్లో కృష్ణాజిల్లా గుడివాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.
News December 14, 2025
తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలు

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి ఐఐటీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నర్సింగ్ ప్రాక్టీషనర్-03, నర్సింగ్ అసిస్టెంట్-03, అంబులెన్స్ డ్రైవర్ 04.. మొత్తం 10 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, జీతం వివరాలకు www.iittp.ac.in చూడండి.