News February 22, 2025
ADB: చంపుతున్నాయ్.. తింటున్నాయ్

ఉమ్మడి ADBజిల్లాను పెద్దపులి, చిరుత హడలెత్తిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచి బయటకి వచ్చి జంతువులపై దాడి చేసి చంపేసి తినేసి వెళ్తున్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో గేదెను పెద్దపులి చంపగా.. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్‌లో చిరుత గొర్రెపిల్లపై దాడి చేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల్లో చిరుత రైతులను పనులు చేసుకోనీయడం లేదు.
Similar News
News December 13, 2025
ఆసిఫాబాద్: ఎన్నికలు.. అక్క(BRS) Vs చెల్లి (కాంగ్రెస్)

ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గాడపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో సొంత అక్కాచెల్లెళ్లు నిలవడం చర్చనీయాంశంగా మారింది. అక్క శంకరమ్మ BRS బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, చెల్లి విమల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం తమకు కలిసివచ్చే అంశంగా విమల భావిస్తున్నారు. ఇద్దరూ పోటీలో ఉండటంతో గాడపల్లి పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.
News December 13, 2025
NLG: కాంగ్రెస్ 377, బీఆర్ఎస్ 186, బీజేపీ 9

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 60 శాతం సర్పంచి స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 630 గ్రామాలకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 377 స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ మద్దతు కలిగిన అభ్యర్థులు 186 సర్పంచ్ స్థానాలును గెలుచుకున్నారు. సీపీఎం, సీపీఐ అభ్యర్థులు 11 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 9 స్థానాలకే పరిమితమైంది.
News December 13, 2025
KMR: సర్పంచ్ పోరులో యువత.. రేపటి భవిష్యత్తుకై

కామారెడ్డి జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రేపు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో యువత, మహిళలు విజయదుందుభి మ్రోగించగారు. రేపటి రెండవ విడత ఎన్నికల్లో పోరులో నిలిచిన యువత రాజకీయంగా తమ స్థానాలను కొంగ్రొత్త ఆశలతో రాణిస్తారో లేదో చూడాలి. దేశ, రాష్ట్ర రాజకీయ నాయకులను పరంపరను పుణికిపుచ్చుకుంటున్న యువత రేపటి భవిష్యత్తుకై తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు.


