News February 22, 2025
ADB: చంపుతున్నాయ్.. తింటున్నాయ్

ఉమ్మడి ADBజిల్లాను పెద్దపులి, చిరుత హడలెత్తిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచి బయటకి వచ్చి జంతువులపై దాడి చేసి చంపేసి తినేసి వెళ్తున్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో గేదెను పెద్దపులి చంపగా.. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్‌లో చిరుత గొర్రెపిల్లపై దాడి చేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల్లో చిరుత రైతులను పనులు చేసుకోనీయడం లేదు.
Similar News
News March 22, 2025
VZM: జిల్లాలో పర్యటించిన హైకోర్టు న్యాయమూర్తి

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ చీమలపాటి రవి శనివారం జిల్లా పర్యటనకు నగరానికి చేరుకున్నారు. జిల్లా కోర్టులో జరిగిన న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా SP వకుల్ జిందాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయికల్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారు.
News March 22, 2025
క్రికెట్ బెట్టింగులకు దూరంగా ఉండండి: బాపట్ల ఎస్పీ

యువత బెట్టింగులకు దూరంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈరోజు నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్ మ్యాచ్లను ఆసరాగా తీసుకొని క్రికెట్ బెట్టింగులకు తెరలేపే అవకాశం ఉందని అన్నారు. యువత బెట్టింగుల వైపు వెళ్లకుండా చదువుపై దృష్టి సాధించాలని అన్నారు.
News March 22, 2025
మెదక్: ఏప్రిల్ 7 నుంచి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం

ఏప్రిల్ 7 నుంచి 15వ తేదీ వరకు టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నట్లు డీఈవో రాధా కిషన్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన టీచర్లకు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల కేంద్రంలోని సెయింట్ ఆర్నాల్డ్ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం ఉంటుందని పేర్కొన్నారు. మూల్యాంకనం విధులకు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పకుండా హాజరు కావాలని డీఈవో సూచించారు.