News February 22, 2025
ADB: చంపుతున్నాయ్.. తింటున్నాయ్

ఉమ్మడి ADBజిల్లాను పెద్దపులి, చిరుత హడలెత్తిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచి బయటకి వచ్చి జంతువులపై దాడి చేసి చంపేసి తినేసి వెళ్తున్నాయి. శుక్రవారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గేదెను పెద్దపులి చంపగా..నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లో చిరుత గొర్రెపిల్లపై దాడి చేసింది. మరోవైపు ADBజిల్లా తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల్లో చిరుత రైతులను పనులు చేసుకోనీయడం లేదు.
Similar News
News December 3, 2025
జగిత్యాల: డీసీసీ నియామక పత్రాన్ని అందుకున్న నందయ్య

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన నందయ్యకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. హైద్రాబాద్ గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా పాటుపడాలని సూచించారు.
News December 3, 2025
గన్నేరువరం: ‘క్రీడల్లోనూ బాలికలు ముందుండాలి’

బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. స్నేహిత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ కేజీబీవీ, గన్నేరువరం పాఠశాలలను ఆమె సందర్శించారు. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని బాలికలకు సూచించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.
News December 3, 2025
రెడ్కో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్‌గా మనోహర్

తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్‌గా మెట్పల్లి పట్టణానికి చెందిన రిటైర్డ్ ఏడీఈ దుర్శెట్టి మనోహర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన ఏడాది కాలం పాటు కొనసాగనున్నారు. పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, సోలార్ ప్రాజెక్టుల స్థాపన తదితర ప్రభుత్వ పథకాల అమలు చేయడంలో ఆయన పాలు పంచుకోవాల్సి ఉంటుంది.


