News January 31, 2025
ADB: చేతగానితనానికి నిదర్శనం కేసీఆర్: మంత్రి సీతక్క

చేతగానితనానికి నిదర్శనం కేసీఆర్ అని మంత్రి సీతక్క విమర్శించారు. కుంభకర్ణుడిలా ఫామ్ హౌస్లో పడుకుంటారని మండిపడ్డారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీకి రాలేదని పేర్కొన్నారు. వందల ఎకరాల ఫాంహౌస్లకు రైతుబంధు ఇస్తే తాము.. వరి రైతులకు బోనస్, గ్యాస్ను రూ.500 సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మళ్లీ కొత్త పథకాలతో ప్రజలకు మేలు చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
మెదక్: రైతుల కష్టాలపై విద్యార్థుల ప్రదర్శన అదుర్స్

మెదక్ జిల్లా సైన్స్ ఫెయిర్లో నవాబుపేట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు రైతుల సమస్యలపై రూపొందించిన ప్రదర్శన ఆకట్టుకుంది. పంట కోత అనంతరం రోడ్లపై ధాన్యం ఆరబెట్టడానికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ధాన్యాన్ని ఆరబెట్టడం, ఎత్తడం, కుప్పలు చేయడంలో ఒకే వ్యక్తి ఉపయోగించే సులభమైన యంత్రాన్ని ప్రదర్శించారు. టీచర్ అశోక్ దేవాజీ మార్గదర్శకత్వంలో దీన్ని రూపొందించారు.
News December 5, 2025
చలికాలం.. నిండా దుప్పటి కప్పుకుంటున్నారా?

చలికాలం కావడంతో కొందరు తల నుంచి కాళ్ల వరకు ఫుల్గా దుప్పటిని కప్పుకొని పడుకుంటారు. ఇలా చేస్తే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందక రక్తప్రసరణ తగ్గి గుండెపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ కూడా మందగిస్తుందట. ‘దుప్పటి ముఖానికి అడ్డుగా ఉంటే CO2 లెవల్స్ పెరిగి మెదడు పనితీరుపై ఎఫెక్ట్ చూపుతుంది. O2, Co2 మార్పిడికి అడ్డంకి ఏర్పడి శ్వాసకోస సమస్యలొస్తాయి’ అని చెబుతున్నారు.
News December 5, 2025
కర్నూలు: ‘QR కోడ్ స్కాన్ చేయండి.. అభిప్రాయం తెలపండి’

ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని సివిక్స్ సొసైటీ కన్వీనర్ రఘురాం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వానికి ఆదోనితో పాటు 5 నియోజకవర్గాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సివిక్స్ సొసైటీ తరఫున క్యూఆర్ కోడ్ను విడుదల చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఆన్లైన్ సంతకం చేయాలన్నారు. దీన్ని 5 నియోజకవర్గాల ప్రజల తమ బాధ్యతగా భావించాలని కోరారు.


