News January 31, 2025
ADB: చేతగానితనానికి నిదర్శనం కేసీఆర్: మంత్రి సీతక్క

చేతగానితనానికి నిదర్శనం కేసీఆర్ అని మంత్రి సీతక్క విమర్శించారు. కుంభకర్ణుడిలా ఫామ్ హౌస్‌లో పడుకుంటారని మండిపడ్డారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీకి రాలేదని పేర్కొన్నారు. వందల ఎకరాల ఫాంహౌస్‌లకు రైతుబంధు ఇస్తే తాము.. వరి రైతులకు బోనస్, గ్యాస్‌ను రూ.500 సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మళ్లీ కొత్త పథకాలతో ప్రజలకు మేలు చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News February 16, 2025
కాళేశ్వరం: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి పురస్కరించుకొని కాళేశ్వరం పుణ్య క్షేత్రానికి మంథని డిపో నుంచి మంథని-కాళేశ్వరానికి 26 బస్సులను నడిపించనున్నట్లు KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీని బట్టి కరీంనగర్, గోదావరిఖని డిపోల నుంచి అదనపు బస్సులను నడిపిస్తామన్నారు. అలాగే వేలాల క్షేత్రానికి గోదావరిఖని డిపో నుంచి GDK-వేలాలకు 56 బస్సులు, మంథని డిపో నుంచి మంథని-వేలాలకు 40 బస్సులు నడిపిస్తామన్నారు.

కూనవరంలో మాంసం, గుడ్లు అమ్మకాలపై నిషేధం: తహశీల్దార్

కూనవరం మండలంలో కోడి మాంసం,గుడ్లు అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు తహశీల్దార్ కే.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. చింతూరు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెరుగుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా మండల వ్యాప్తంగా అన్ని దుకాణాల్లో చికెన్, కోడిగుడ్లు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు తాత్కాలికంగా నిషేధించామన్నారు.