News January 14, 2026
ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News February 15, 2026
CNF అంటే ఏంటో తెలుసా?

రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు CNF అని వస్తే టికెట్ కన్ఫామ్ అయిందని అర్థం. కోచ్ నంబర్, బెర్త్ నంబర్ మీ టికెట్‌పై మెన్షన్ చేస్తారు. ఉదాహరణకు CNF/D3/18/WS అంటే D3-కోచ్ నంబర్, 18- సీట్ నంబర్, WS- విండో సీట్. IRCTC లేదా అఫీషియల్ రైల్వే సైట్‌లో PNR నంబర్ ఎంటర్ చేస్తే బుకింగ్ స్టేటస్ తెలుస్తుంది.
Share It
News February 15, 2026
తిరుపతి స్విమ్స్‌లో ఉద్యోగాలు

తిరుపతి స్విమ్స్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మెడికల్ ఆఫీసర్లు-4, స్టాఫ్ నర్సులు-4, ఏఎన్ఎం-4, మమోగ్రఫీ టెక్నీషియన్-2, కార్డియో వాస్క్యలర్ టెక్నీషియన్ గ్రేడ్-2, డీఏవో-2, పీఆర్వో-2, మెడికో సోషల్ వర్కర్-2, ఎలక్ట్రీషియన్62, డ్రైవర్లు-2 పోస్టులు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు svimstpt.ap.nic.in వెబ్‌సైట్ చూడాలి.
News February 15, 2026
మన్యంకొండలో శేష వాహన సేవ

మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి శేష వాహన సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారిని గర్భాలయం నుంచి దక్షిణ కట్ట వరకు మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, అలహరి రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.


