News March 25, 2025
ADB: జిల్లాకు 2 మంత్రి పదవులు..!

రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడిజిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో సమస్యలపై MLAలు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఇతరులను కలవాల్సి వచ్చేది. దీంతో ప్రజల సమస్యలు తీరలేదనే ఆరోపణలున్నాయి. అయితే ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయనే ప్రచారం ఊపందుకుంది. ఈ విడతలో చెన్నూర్ MLA వివేక్, తర్వాత MNCL MLA ప్రేమ్సాగర్రావుకు దక్కనున్నట్లు సమాచారం.
Similar News
News November 7, 2025
ఆదిలాబాద్: పార్శిల్ డెలివరీ అంటూ ఏం చేశారంటే..!

సైబర్ నేరగాళ్ల వలలో మరో వ్యక్తి మోసపోయాడు. పార్శిల్ డెలివరీలో ఇబ్బందులు ఉన్నాయంటూ వచ్చిన మెసేజ్ కారణంగా బాధితుడు రూ.46,408 పోగొట్టుకున్నాడు. వన్ టౌన్ CI సునీల్ వివరాల మేరకు.. శాంతినగర్ కు చెందిన బిలాల్ కు ఇండియా పోస్టు డెలివరీ యువర్ పార్సెల్ వాజ్ అన్సక్సెస్ఫుల్ డ్యూ టూ ఇన్కరెక్ట్ అడ్రస్ అనే సాధారణ మెసేజ్ వచ్చింది. వెబ్ సైట్ లో అతను అప్డేట్ చేయగా డబ్బులు పోగొట్టుకున్నాడు. శుక్రవారం ఫిర్యాదు చేశాడు.
News November 7, 2025
విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణ, పాఠశాల హాజరు పెంపు దిశగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మెన్స్ట్రువల్ హైజీన్ అవగాహన, శానిటరీ ప్యాడ్ల పంపిణీ, మహువా లడ్డూల సరఫరా తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి నెలా విద్యార్థినుల ఆరోగ్య స్థితిపై సమీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.
News November 6, 2025
ADB: ఈ రెండో శనివారం సెలవు రద్దు

ఈ నెల 8న రెండో శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు పని దినాలుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 28న అత్యధిక వర్షం కురిసిన నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో ఆ సెలవు దినానికి బదులుగా ఈ శనివారం విద్యా సంస్థల సెలవు రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యా సంస్థలు గమనించాలని సూచించారు.


