News March 25, 2025
ADB: జిల్లాకు 2 మంత్రి పదవులు..!

రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడిజిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో సమస్యలపై MLAలు ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క, ఇతరులను కలవాల్సి వచ్చేది. దీంతో ప్రజల సమస్యలు తీరలేదనే ఆరోపణలున్నాయి. అయితే ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయనే ప్రచారం ఊపందుకుంది. ఈ విడతలో చెన్నూర్ MLA వివేక్, తర్వాత MNCL MLA ప్రేమ్‌సాగర్‌రావుకు దక్కనున్నట్లు సమాచారం.
Similar News
News November 7, 2025
వంగ, బెండలో కాపు దశలో చీడల నివారణ

కాపు దశలో కాయలను కోసే ముందు అక్షింతల పురుగు, పెంకు పురుగులు ఆశించిన రెమ్మలను, కాయలను, పిందెలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. తర్వాత కాయలు కోయాలి. తోటలో మొక్కలు బాగా తడిసేటట్లు కాయలు కోసిన తర్వాత లీటరు నీటికి 0.5 గ్రా ఎమామెక్టిన్ బెంజోయేట్, 0.4ml కోరాజిన్, 2ml ప్రొఫినోపాస్ మందుల్లో ఒక దానిని 5ml వేప మందుతో కలిపి స్ప్రే చేయాలి. కాయలను కోసేముందు రైతులు ఎట్టి పరిస్థితులలోనూ మందులు స్ప్రే చేయకూడదు.
News November 7, 2025
ములుగు జిల్లాలో 245 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు

ములుగు జిల్లాలో 245 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్థులున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిపిన సర్వేలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించారు. సర్వైకల్ క్యాన్సర్‌తో 27మంది, బోన్/లివర్ క్యాన్సర్‌తో 5మంది, బ్లడ్ క్యాన్సర్‌తో 9మంది, బ్రెస్ట్ క్యాన్సర్‌తో 70మంది, ఓరల్ క్యాన్సర్‌తో 33మంది, గొంతు క్యాన్సర్‌తో 18మంది, ఇతర క్యాన్సర్ లక్షణాలతో 83మంది బాధపడుతున్నారు. ‘ఈరోజు క్యాన్సర్ అవగాహన దినోత్సవం’.
News November 7, 2025
గోపాలపురం: కొడవలితో భార్యపై భర్త దాడి

భార్యపై అనుమానంతో భర్త కొడవలితో దాడి చేసిన ఘటన గోపాలపురం మండలం దొండపూడి మేదరపేటలో జరిగింది. ఎస్‌ఐ మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సింధూజపై అనుమానం పెంచుకున్న ఆమె భర్త కాసాని రామకృష్ణ మద్యం మత్తులో వచ్చి దాడి చేశాడు. సింధూజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


