News December 12, 2024

ADB: జిల్లాలో పలువురు ఎస్ఐలకు స్థానచలనం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు ఎస్ఐలకు స్థాన చలనం కల్పిస్తూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ మల్టీ జోన్ 1 డిఐజి ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమంది ఎస్ఐలు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఆయా స్టేషన్లలోనే వారిని కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు. మరి కొంతమందిని స్థానచలనం కల్పించారు. ఇదిలా ఉంటే ఏ. భీంరావు కు ఎస్సైగా పదోన్నతి కల్పించారు.

Similar News

News December 27, 2024

నార్నూర్: కేజీబీవీ తనిఖీ చేసిన ఎంఈఓ

image

నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను శుక్రవారం మండల విద్యాశాఖాధికారి పవార్ అనిత తనిఖీ చేశారు. అనంతరం బోధన సిబ్బంది రికార్డులను పరిశీలించి విద్యార్థులకు పాఠం నేర్పించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలన్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై దృష్టి పెట్టాలని, పరీక్షల్లో ఉన్నత స్థాయిలో నిలవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

News December 27, 2024

ఆదిలాబాద్‌: కేయూ పరిధిలో పరీక్షలు వాయిదా

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దృష్ట్యా కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలకు వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేడు ఉదయం జరగాల్సిన డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్ష, మధ్యాహ్నం జరగాల్సిన 1వ సెమిస్టర్ పరీక్ష వాయిదా వేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 31 మంగళవారం జరుగుతాయని స్పష్టం చేశారు. కావున ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News December 27, 2024

మంచిర్యాల: సిగ్నల్స్ రావాలంటే చెట్టెక్కాల్సిందే.!

image

ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ లేని వారంటూ ఉండరు. సాంకేతికత చాలా విస్తరించినప్పటికీ కొన్ని గ్రామాల్లో సెల్‌ఫోన్లకు సిగ్నల్స్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్ గ్రామంలో టెలిఫోన్ సిగ్నల్ లేక గ్రామస్థులు ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే చెట్లు, గోడలు, బిల్డింగులు ఎక్కుతున్నారు. బంధువులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా నెట్వర్క్ ఏరియాలో లేదు అని వస్తుందని వాపోతున్నారు.