News January 24, 2025
ADB: జిల్లాలో మరో కౌలు రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకోగా తాజాగా బేల మండలంలోని మీర్జాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైత గోవింద్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. 4 ఎకరాల కౌలు భూమిలో పత్తి సాగు చేయగా, దిగుబడి రాక పురుగుల మందు తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మృతుడికి రూ.5లక్షల అప్పు ఉన్నట్లు సమాచారం.
Similar News
News February 25, 2026
సంగారెడ్డి: ‘TG-iPASS ద్వారా వేగంగా అనుమతులు’

పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా TG-iPASS విధానం ద్వారా పారదర్శకంగా, వేగంగా అనుమతులు మంజూరు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల విషయంలో అధికారులు ఖచ్చితత్వంతో వ్యవహరించాలని, నిబంధనల ప్రకారం దరఖాస్తులను తనిఖీ చేసి త్వరగా పరిష్కరించాలని సూచించారు.
News February 25, 2026
150 ఫైటర్ జెట్లను మోహరించిన అమెరికా!

ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై ఆందోళన నేపథ్యంలో అమెరికా భారీ సైనిక మోహరింపు చేపట్టినట్లు సమాచారం. 20 ఏళ్లలో లేని విధంగా యూరప్, పశ్చిమాసియా స్థావరాలకు 150కి పైగా యుద్ధ విమానాలను తరలించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. వీటిలో ఫైటర్ జెట్లు, రీఫ్యూయలింగ్ విమానాలు ఉన్నాయి. అదనంగా USS గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ విమాన వాహక నౌక రంగంలోకి దిగింది. ఇరాన్ ముప్పును అడ్డుకునేందుకే అమెరికా తన బలాన్ని ప్రదర్శిస్తోంది!
News February 25, 2026
మంచిర్యాల: పదో తరగతికి 48 పరీక్షా కేంద్రాలు

మంచిర్యాల జిల్లాలో 48 పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్లో డీఈఓ యాదయ్య, ఇతర విద్యాశాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. 9,703 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.


