News February 26, 2025

ADB జిల్లాలో 31 ఇంటర్ పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

image

ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 18,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ఎస్ఈకి సూచించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేర్చాలన్నారు.

Similar News

News February 25, 2026

FLASH: ఇంద్రవెళ్లిలో యాక్సిడెంట్

image

ఇంద్రవెళ్లి మండల కేంద్రంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై నుంచి పడి గాయాల పాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని అంజి రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి వ్యక్తి కింద పడిపోగా గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు అపస్మారక స్థితిలో ఉండడంతో ఆ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది.

News February 25, 2026

ADB: మార్చి 28కి జాతీయ లోక్ అదాలత్ వాయిదా

image

ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 14న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ అదే నెల 28వ తేదీకి వాయిదా పడినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు వెల్లడించారు. అదనంగా లభించిన ఈ రెండు వారాల సమయాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పరస్పర అంగీకారంతో రాజీ పడటం ద్వారా దీర్ఘకాలిక కేసుల నుంచి విముక్తి పొందవచ్చని, మార్చి 28న జరిగే అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.

News February 25, 2026

ఆదిలాబాద్: మార్చి 14 నుంచి SSC పరీక్షలు

image

పదో తరగతి పరీక్షలను మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు 52 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. 10,928 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలని, పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడలన్నారు.