News February 26, 2025

ADB జిల్లాలో 31 ఇంటర్ పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

image

ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 18,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ఎస్ఈకి సూచించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేర్చాలన్నారు.

Similar News

News March 25, 2025

ఆదిలాబాద్: బాధిత కుటుంబానికి రూ.8 లక్షల చెక్కు

image

గత సంవత్సరం తాంసి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ గంగన్న కుటుంబానికి ప్రభుత్వపరంగా వచ్చే అన్ని సహాయ సహకారాలు సకాలంలో అందజేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందిని ఆదేశించారు. హెడ్ కానిస్టేబుల్ గంగన్న భార్య ప్రమీలకు మంగళవారం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.8 లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

News March 25, 2025

ఆదిలాబాద్‌కు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు

image

జిల్లాలోని నార్నూర్ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర బృందం సభ్యులు ఆదిలాబాద్‌కువచ్చారు. డైరెక్టర్ మృత్యుంజయ ఝా, శుభోద్ కుమార్ డిప్యూటీ సెక్రటరీలను స్థానిక పెన్‌గంగా గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మర్యాద పూర్వకంగా కలసి పూలమొక్కను, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు.

News March 25, 2025

ADB: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

error: Content is protected !!