News February 21, 2025

ADB: జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులు కీలకం: కలెక్టర్

image

జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షిషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో టీఎన్జీవో నూతన జిల్లా డైరీని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి‌తోపాటు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగులు సమష్టిగా పని చేస్తూ జిల్లాను ప్రగతి పథంలో ముందు ఉంచాలని పేర్కొన్నారు.

Similar News

News March 21, 2025

ఖండాలలో నీటి సమస్య లేకుండా చర్యలు: కలెక్టర్

image

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాలలో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గ్రామం నుంచి 4 KM దూరంలో ఉన్న వాగు వద్ద బోర్వెల్ వేసి అక్కడి నుంచి పైపు లైన్ ద్వారా గ్రామంలోని GLSR ట్యాంకుకు నీరు సరఫరా చేస్తామన్నారు. రోజు ఉదయం 7గంటలకు, సాయంత్రం 6 గంటలకు 10,000 లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.

News March 21, 2025

ఆదిలాబాద్ డైట్ కళాశాలలో ఉద్యోగాలు

image

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటా, ఫోటోలతో ఈ నెల 22 నుంచి 24 లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులను నమూనా తరగతుల ఆధారంగా ఎంపిక చేస్తామని వెల్లడించారు.

News March 21, 2025

గుడిహత్నూర్‌లో క్లినిక్ సీజ్

image

గుడిహత్నూర్‌లోని ఓ క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు. సూర్యవంశీ అనే RMP వైద్యుడు తన పరిధికి మించి ఓ గర్భం దాల్చిన బాలికకు అబార్షన్ పిల్స్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న DMHO డా.నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు అధికారులు సదరు క్లినిక్‌ను సీజ్ చేశారు. జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న RMPలు కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, పరిధికి మించి వైద్యం అందిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

error: Content is protected !!