News April 12, 2025

ADB జిల్లా కోర్టులో PPలు వీరే

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది అబ్దుల్ రహీం జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా మరో న్యాయవాది ప్రవీణ్ కుమార్ పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. వీరిద్దరి పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుంది. ఈ సందర్భంగా వీరికి పలువురు న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు.

Similar News

News April 17, 2025

రోగికి ఆధార్ తప్పనిసరి : ఆదిలాబాద్ DMHO

image

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు తప్పకుండా ఆధార్ కార్డును తీసుకొని వెళ్లాలని ఆదిలాబాద్ DMHO డా.నరేందర్ రాథోడ్ సూచించారు. తద్వారా వ్యాధిగ్రస్థుల సమాచారం అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తామన్నారు. భవిష్యత్తులో రోగికి అందించిన సేవల వివరాలు తెలుసుకోవడానికి సహాయకారిగా ఉంటుందన్నారు. దీని ద్వారా చికిత్సలు అందించడానికి సులువవుతుందన్నారు. ఆరోగ్య, ప్రాథమిక కేంద్రాలకు ఆధార్ తీసుకు వెళ్లాలన్నారు.

News April 17, 2025

ADB: భానుడి ప్రతాపంతో విలవిల్లాడుతున్న జనం

image

భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ మధ్యాహ్నం 12 గంటలకు నిర్మానుష్యంగా మారాయి. 41 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండు రోజుల నుంచి 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News April 17, 2025

ADB: ‘మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి’

image

జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మహిళా సంఘాల సభ్యులకు ఆడిట్ నిర్వహణ తదితరాంశాలపై శిక్షణ తరగతులను బుధవారం నిర్వహించారు. డీఆర్డీవో రాథోడ్ రవీందర్ పాల్గొన్న మాట్లాడారు. మహిళా సంఘాల పుస్తకాలను పారదర్శకంగా ఆడిట్ నిర్వహిస్తూ వారి బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలని సూచించారు.

error: Content is protected !!