News January 27, 2025
ADB జిల్లా వాసికి జీవనసాఫల్య పురస్కారం

ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి గోపిడి చంద్రశేఖర్ రెడ్డి జీవన సాఫల్య పురస్కరానంని అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతకు చేసిన విశిష్ట సేవలు, పచ్చదనం, పర్యావరణ వ్యవస్థను పెంపొందించడమే కాకుండా పలు కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు రాజ్భవన్ తెలిపింది.
Similar News
News December 2, 2025
జనగామ: 3 వార్డులకు ఎన్నికలు లేవు!

తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల పత్రాల పరిశీలన కొనసాగుతోంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో 3 వార్డులకు రిజర్వేషన్ల కారణంగా నామినేషన్లు దాఖలు కాలేదు. జనగామ జిల్లాలో రెండో విడతలో కూడా 7 వార్డులకు నామినేషన్లు దాఖలు కానట్లు తెలుస్తోంది. మొత్తంగా 10 వార్డుల వరకు నామినేషన్లు రాలేదని సమాచారం.
News December 2, 2025
ఆ ఎస్జీటీలకు 6 నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరి: విద్యాశాఖ

AP: బీఈడీ క్వాలిఫికేషన్తో ఎస్జీటీలుగా నియమితులైన వారు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. 2018-23 మధ్య కాలంలో నియమితులైన వారు ఈ నెల 25 వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఎస్జీటీ ఉద్యోగాలకు డీఈడీ చేసినవారే అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
News December 2, 2025
VKB: పంచాయతీ బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో..?

వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ‘పంచాయతీ’ వేడెక్కింది. దాదాపు 2ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బరిలో నిలిచేందుకు ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు. కొన్నిచోట్ల ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేయడం నేతలకు తలనొప్పిగా మారింది. ఓట్లు చీలకుండా ఒక్కరినే బరిలో దించేందుకు, నామినేషన్ల ఉపసంహరణకు నాయకులు బుజ్జగిస్తున్నారు. రేపటితో తొలివిడత బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో తేలనుంది.


