News March 25, 2025

ADB జిల్లా వ్యాప్తంగా పోలీసులు మీకోసం

image

ప్రజలకు మంచి పోలీసు సేవలను అందించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు అధికారులతో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్టేషన్ SHOలు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని, ప్రతి పోలీసుకు క్రమశిక్షణ తప్పనిసరి అని సూచించారు. జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను, మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని, ‘పోలీసు మీకోసం’ కార్యక్రమాలు కొనసాగాలన్నారు.

Similar News

News April 25, 2025

ADB: వడదెబ్బకు ఏడుగురి మృతి

image

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.

News April 25, 2025

ADB: వివాహేతర సంబంధం.. భార్యను చంపిన భర్త

image

గుడిహత్నూర్ మండలకేంద్రంలో భర్త చేతిలో భార్య కీర్తి (25) దారుణ హత్య విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కీర్తి భర్త మారుతి 5 ఏళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రోజూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది. సదరు మహిళను ఇంటికి తీసుకువస్తానని భర్త చెప్పడంతో గురువారం భార్య మందలించింది. ఇరువురి మధ్య గొడవ జరిగి భార్యను గొడ్డలితో దారుణంగా నరికాడు. తర్వాత మారుతి పరారయ్యాడు.

News April 25, 2025

ADB: మే 4న NEET.. కలెక్టర్ సమీక్ష

image

UGC, NEET (నీట్) నిర్వహణపై గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సంబంధిత అధికారులు, ప్రిన్సిపల్స్‌తో సమీక్ష నిర్వహించారు. మే 4వ తేదిన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నీట్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

error: Content is protected !!