News May 18, 2024

ADB: టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో..!

image

ADB:టెట్ అభ్యర్థులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. దరఖాస్తుల సమయంలో రుసుము రూ.400 నుంచి 1000 పెంచగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.ఇదిలా ఉంటే పరీక్షా కేంద్రాల కేటాయింపులో సైతం సొంత జిల్లాలో కాకుండా దూరపు ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దరఖాస్తుకు రూ.1000 తీసుకొని దూరపు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 2, 2024

నృత్య ప్రదర్శనలో నిర్మల్ చిన్నారుల ప్రతిభ

image

నిర్మల్ జిల్లా శ్రీ బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మల్‌కు చెందిన చిన్నారులు ప్రతిభ కనబరిచి ప్రశంసా పత్రాలను పొందారు. ఈ సందర్భంగా చిన్నారులను పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.

News December 2, 2024

నిర్మల్: ముస్తాబైన ప్రభుత్వ కార్యాలయాలు

image

ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆదివారం సోన్‌లో మిరుమిట్లు గొలిపే విధంగా స్థానిక పోలీస్ స్టేషన్ స్టేషన్‌ను అలంకరించారు. కాగా ఈ నెల 9 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

News December 1, 2024

లక్షెట్టిపేటలో సీఎం ప్రసంగాన్ని విన్న ఎమ్మెల్యే, కలెక్టర్

image

లక్షెటిపేటలోని రైతు వేదికలో శనివారం ఎమ్మెల్యే, కలెక్టర్ రైతు పండగ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసంగించారు. కాగా ఆ ప్రసంగాన్ని వర్చువల్‌గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్ మండల అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు.