News February 12, 2025

ADB: టెన్త్ అర్హతతో 37 ఉద్యోగాలు

image

ఆదిలాబాద్ డివిజన్‌‌లో 37 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News December 9, 2025

పౌష్టిక ఆహారంపై యాప్ ద్వారా పర్యవేక్షణ: పీవో

image

ఉమ్మడి జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఐటీడీఏ పల్స్ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని ఇన్‌ఛార్జ్ పీవో యువరాజ్ తెలిపారు. విద్యార్థులకు కామన్ డైట్ మెనూ సక్రమంగా అమలు చేయడాన్ని పర్యవేక్షించేందుకు ఈ యాప్ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు యాప్‌ సమర్థంగా వినియోగిస్తూ ఫొటోలు, వివరాలు అప్లోడ్ అవుతున్నాయన్నారు.

News December 9, 2025

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిగా రామారావు

image

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిగా పి.వి.జి. రామారావును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారి కోన శశిధర్ ఆదేశాలు ఇచ్చారు. కాగా, పల్నాడు జిల్లా డీఈఓగా పనిచేస్తున్న చంద్రకళను కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీ చేశారు.

News December 9, 2025

విశాఖలో టెట్ పరీక్షలు.. అభ్యర్థులకు డీఈవో కీలక సూచనలు

image

విశాఖ జిల్లాలో AP TET-2025 పరీక్షలు డిసెంబర్ 10 నుంచి 21 వరకు 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ (CBT) విధానంలో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పక తీసుకురావాలని, పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందే సెంటర్‌కు చేరుకోవాలని ఆయన సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని స్పష్టం చేశారు.