News February 12, 2025
ADB: టెన్త్ అర్హతతో 37 ఉద్యోగాలు

ఆదిలాబాద్ డివిజన్లో 37 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News November 1, 2025
NFCలో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీ

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) హైదరాబాద్‌లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి, ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులుగా పేర్కొంది. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. నెలకు రూ.9,600-10,560 వరకు స్టైఫండ్ చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు <
News November 1, 2025
కొంగ, జింక ఆకారంలో ఎలక్ట్రిక్ పోల్స్.. ఎందుకంటే?

స్థానిక కల్చర్, సంస్కృతి, వైల్డ్ లైఫ్‌ను ప్రతిబింబించేలా ఆస్ట్రియాలో ఎలక్ట్రిక్ పోల్స్‌ను ఏర్పాటుచేస్తున్నారు. కొంగలు, దుప్పులు, జింకల ఆకారంలో నిర్మించిన పోల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ప్రకృతితో మిళితమైన డిజైన్ల వల్ల గ్రిడ్ విస్తరణ ప్రాజెక్టులకు ప్రజల సహకారమూ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రియేటివ్ ఇంజినీరింగ్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
News November 1, 2025
ANM విస్తా మొబైల్ అప్లికేషన్‌ను వినియోగించాలి: JC

అన్నమయ్య జిల్లాలో సమర్థవంతమైన పరిపాలన కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ANM విస్తా మొబైల్ అప్లికేషన్‌ను అధికారులందరూ వినియోగించాలని JC ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తదితర శాఖల జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లా సుపరిపాలనపై రూపొందించబడిన ANM విస్తా మొబైల్ అప్లికేషన్‌పై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.


