News August 22, 2024
ADB: డెంగ్యూ కేసులను నియంత్రించేందుకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

డెంగ్యూ కేసులను నియంత్రించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పట్టణంలోని బాలాజీ నగర్లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై, సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమలు వృద్ధి కాకుండా చూడాలన్నారు. ఆయనతో పాటు డీఎంహెచ్ఓ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఖమర్, తదితరులున్నారు.
Similar News
News December 1, 2025
నార్నూర్: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

నార్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని జాదవ్ నరేష్ (18) ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణపతి తెలిపారు. జైనూర్ మండలం అందుగూడకు చెందిన సునీత, అన్నాజీ దంపతుల కుమారుడు నరేష్ నాలుగేళ్లుగా పాలేరుగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
News December 1, 2025
అతివలకు అండగా ఆదిలాబాద్ షీ టీం: SP

షీ టీం విస్తృత అవగాహన ద్వారా ప్రజలు, విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుందని జిల్లా SP అఖిల్ మహాజన్ అన్నారు. నెల రోజులలో షీ టీం ద్వారా 4 ఎఫ్ఐఆర్, 30 ఈ పెట్టీ కేసులు నమోదు చేసి ఆకతాయిలను అడ్డుకున్నామన్నారు. గ్రామాలలో మహిళలకు, పాఠశాలలలో విద్యార్థులకు సోషల్ మీడియా క్రైమ్, మహిళల పట్ల నేరాల పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎవరైనా వేధింపులకు గురైతే 8712659953 నంబర్ను సంప్రదించాలన్నారు.
News December 1, 2025
సీఎం పర్యటనలో లోపాలు చోటు చేసుకోవద్దు: ADB కలెక్టర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4న ఆదిలాబాద్ జిల్లాకు చేసే పర్యటనను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకూడదని హెచ్చరించారు. అన్ని ఏర్పాట్లు ముందుగానే చేపట్టాలన్నారు.


