News August 22, 2024
ADB: డెంగ్యూ కేసులను నియంత్రించేందుకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్
డెంగ్యూ కేసులను నియంత్రించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పట్టణంలోని బాలాజీ నగర్‌లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై, సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమలు వృద్ధి కాకుండా చూడాలన్నారు. ఆయనతో పాటు డీఎంహెచ్ఓ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఖమర్, తదితరులున్నారు.
Similar News
News September 15, 2024
ADB: రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో మెరిసిన ఉమ్మడి జిల్లా జట్టు
హనుమకొండ పట్టణంలోని JNSస్టేడియంలో 2రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు గోల్డ్ మెడల్ సాదించినట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు, కనపర్తి రమేశ్ తెలిపారు. ఆదివారం ఫైనల్స్‌లో మహబూబ్ నగర్ జట్టుతో తలపడి గెలుపొందినట్లు తెలిపారు. క్రీడాకారులు, కోచ్ సునార్కర్ అరవింద్‌ను పలువురు అభినందించారు.
News September 15, 2024
ఆదిలాబాద్: పట్టుదలతో మూడు ప్రభుత్వ కొలువులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పొచ్చన-రూప దంపతుల కుమారుడు సాయికృష్ణ పట్టుదలతో చదివి మూడు ప్రభుత్వ కొలువులు సాధించాడు. 2018లో గ్రూప్-4 పరీక్షలో సత్తాచాటి, ఆసిఫాబాద్ ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2022లో మళ్లీ గ్రూప్-4 పరీక్ష రాసి ర్యాంకు సాధించాడు. తాజాగా విడుదలైన ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగం నిర్వహించిన పరీక్ష ఫలితాలలో అసిస్టెంట్ ఎనలైటిక్ ఆఫీసర్‌గా ఎంపిక అయ్యాడు.
News September 15, 2024
కాసిపేట: విద్యార్థులతో నిద్రించిన జిల్లా కలెక్టర్
మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కాసిపేట మండలం మలకపల్లిలోని ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించి పరిసరాలు, విద్యార్థులు నిద్రించే గదులు, వంటశాల, రిజిస్టర్‌ను పరిశీలించి విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేసిన అనంతరం అక్కడే నిద్రించారు.