News August 20, 2024
ADB: ‘డెంగ్యూ నివారణ చర్యలు చేపట్టాలి’
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ కోసం నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షిషా అన్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ, మునిసిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 49 వార్డులలో డ్రై డే, ఆంటీ లార్వా, స్ప్రేయింగ్ మరియు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. డిఎంహెచ్ఓ కృష్ణ, బల్దియా కమిషనర్ ఖమర్ ఉన్నారు.
Similar News
News September 11, 2024
నిర్మల్: గృహిణి పై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం
ఓ గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన ఘటన నిర్మల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఓ ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆమె కేకలు వేయగానే పక్కింటి వారు వచ్చేలోపు డెలివరీ బాయ్ పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితుడు విఘ్నేశ్ (23)ని అరెస్టు చేసినట్లు CI రామకృష్ణ తెలిపారు.
News September 11, 2024
ఆదిలాబాద్: 13న ఇంటర్వ్యూ.. 20 వేల జీతం
ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్సెస్)లలో ఈనెల 13న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.సంగీత పేర్కొన్నారు. UpGrad వారి సహకారంతో HDFC Bank లలో శాశ్వత ప్రాతిపదికన బ్యాంకులలో నెలకు 20,000 పైన జీతభత్యాలు అందుకొనే సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ /బిటెక్ లో 50% మార్కులు కలిగి ఉండి 30 సం.రాల లోపు వయసు ఉన్నవారు అర్హులని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News September 11, 2024
కాంగ్రెస్ నేతను పరామర్శించిన బీజేపీ ఎంపీ
ఏఐసీసీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు జాదవ్ నరేష్‌ను అదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం గణేష్ పరామర్శించారు. గుడిహత్నూర్ మండలం తోషం తండ కు చెందిన జాదవ్ నరేష్ అన్నయ్య జాదవ్ చందూలాల్ ఇటీవల మృతి చెందారు. విషషయం తెలుసుకున్న ఎంపీ నరేష్ కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించి, మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ఎంపీ వెంట
బీజేపీ నాయకులు వామన్ గిత్తే, చంద్రకాంత్, నారాయణ తదితరులు ఉన్నారు.