News July 18, 2024
ADB: డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి.. ఇద్దరు జైలుకు

విధులు నిర్వరిస్తున్న పోలీసులపై దాడి చేసిన ఘటనలో ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు 2టౌన్ CI కరుణాకర్‌రావ్ తెలిపారు. RIMSలో కొలిపూర్‌కు చెందిన సాయికుమార్, నవీన్ ఇద్దరు మంగళవారం మద్యం మత్తులో సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నారు. గొడవ ఆపేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్, హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI వెల్లడించారు.
Similar News
News December 8, 2025
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు: ADB కలెక్టర్

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ జెడ్పి సమావేశ మందిరంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల స్టేజ్- 2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ పూర్తి చేసి ఫలితాలు T -పోల్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.
News December 7, 2025
ఆదిలాబాద్: 50 నుంచి 100 మందికి ఓ బాధ్యుడు..!

పంచాయతీ పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది సర్పంచి అభ్యర్థులు ప్రచార జోరు పెంచుతున్నారు. ప్రతి ఓటు కీలకం కావడంతో ఓటర్లు ప్రత్యర్థివైపు వెళ్లకుండా వ్యూహాలు పన్నుతున్నారు. కొన్ని పంచాయతీల్లో 50 నుంచి 100 మంది ఓటర్లకు ఓ బాధ్యున్ని నియమిస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కీలకమైన కుల సంఘాల ఓట్లు దక్కించుకునేందుకు ఆ సంఘంలో చురుకుగా ఉండే వారికి బాధ్యతలు ఇస్తూ ఓట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
News December 7, 2025
ఆదిలాబాద్: ‘COC సభ్యత్వానికి డబ్బులు ఇవ్వొద్దు’

ఆదిలాబాద్‌లోని వ్యాపారులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యత్వం పేరిట డబ్బులు ఇచ్చే అవసరం లేదని, ఇప్పటికే అమాయకుల నుండి డబ్బులు తీసుకున్న ఒక వ్యక్తి పై ఎస్పీకి ఫిర్యాదు చేశామని అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ మాటోలియా తెలిపారు. ఎవరైనా బాధితులు డబ్బులు ఇచ్చినట్లయితే తమకు సమాచారం అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న కార్యాలయానికి వచ్చి వివరాలు ఇవ్వాలన్నారు.


