News September 9, 2024
ADB: తండ్రికి శిక్ష పడుతుందేమోనని కొడుకు ఆత్మహత్య

కోర్టులో తన తండ్రికి శిక్ష పడుతుందేమో అన్న భయంతో కొడుకు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన జైనథ్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గూడ రాంపూర్కు చెందిన దేవన్నపై జైనథ్ PSలో గతంలో అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నేటి నుంచి వాదనలు ప్రారంభంకానున్నాయి. తండ్రికి శిక్ష పడుతుందేమోనని కొన్ని రోజులుగా కుంగిపోతున్న కొడుకు బండారి సంతోశ్(15)ఈ నెల 6న ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News December 3, 2025
విజయ్ మర్చెంట్ ట్రోఫీకి ADB క్రికెటర్ ఎంపిక

ADB జిల్లాకు చెందిన యువ క్రికెటర్ కశ్యప్ పటాస్కర్ ప్రతిష్టాత్మక విజయ్ మర్చెంట్ ట్రోఫీ (అండర్–16) కి వరుసగా రెండోసారి ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కర్ణాటకలోని శివమొగ్గలో జరగనుంది. విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక కావడం పట్ల శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తదితరులు కశ్యప్కు అభినందనలు తెలిపారు.

ADB: సీఎం రేవంత్ పర్యటనపైన ప్రగతి ఆశలు

సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సీఎం పర్యటనతో జిల్లా అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. బాసర ఆలయం, కుంటాల జలపాతం, జైనథ్ టెంపుల్ అభివృద్ధిపై వరాల జల్లు కురిపిస్తారని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు, సమస్యలపై సీఎం స్పందిస్తే మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇలా జిల్లాకి ఇంకేం కావాలో కామెంట్ చేయండి.