News January 23, 2025

ADB: తమ్ముడిని అరెస్ట్ చేశామని ఫోన్

image

ఆదిలాబాద్ 1 టౌన్‌లో సైబర్ క్రైమ్ కేస్ బుధవారం నమోదైంది. సీఐ సునీల్ కుమార్ కథనం ప్రకారం.. తిర్పల్లికి చెందిన అఫ్రోజ్‌ఖాన్‌కు ఈనెల 16న ఓ కాల్ వచ్చింది. మీ తమ్ముడు తబ్రేజ్ అత్యాచారం కేసులో అరెస్టు అయ్యాడని, అతడిని విడిపించుకోవాలంటే రూ.30వేలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. అతడు వెంటనే వారి ఫోన్ నంబర్లకు నగదు బదిలీ చేశాడు. తర్వాత తమ్ముడు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News November 3, 2025

వైఫల్యం చెందిన అధికారిపై చర్యలు: కలెక్టర్

image

సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి 454 అర్జీలు అందాయని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ప్రజా సమస్యలను కేటాయించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆమె ఆదేశించారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అర్జీలకు రీఓపెన్ లేకుండా పరిష్కరించాలని, వైఫల్యం చెందిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News November 3, 2025

NRPT: లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి: జిల్లా జడ్జి

image

నవంబర్ 15న జరిగే లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు కోరారు. సోమవారం జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యే కేసులపై కక్షిదారులతో మాట్లాడి రాజీ చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.

News November 3, 2025

NRPT: ప్రజావాణిలో 48 ఫిర్యాదులు: అదనపు కలెక్టర్

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 48 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు. సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. అందిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.