News January 23, 2025
ADB: తమ్ముడిని అరెస్ట్ చేశామని ఫోన్

ఆదిలాబాద్ 1 టౌన్‌లో సైబర్ క్రైమ్ కేస్ బుధవారం నమోదైంది. సీఐ సునీల్ కుమార్ కథనం ప్రకారం.. తిర్పల్లికి చెందిన అఫ్రోజ్‌ఖాన్‌కు ఈనెల 16న ఓ కాల్ వచ్చింది. మీ తమ్ముడు తబ్రేజ్ అత్యాచారం కేసులో అరెస్టు అయ్యాడని, అతడిని విడిపించుకోవాలంటే రూ.30వేలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. అతడు వెంటనే వారి ఫోన్ నంబర్లకు నగదు బదిలీ చేశాడు. తర్వాత తమ్ముడు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News October 14, 2025
చోడవరంలో 275 కిలోల గంజాయి పట్టివేత

చోడవరం వద్ద పోలీసులు 275 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, అల్లూరి జిల్లా తర్లగూడకు చెందిన వంతల దేవదాస్ ఒడిశా చిత్రకొండ నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజస్థాన్‌కు తరలించేందుకు యత్నించాడు. ఎనిమిది సంచుల్లో ప్యాక్ చేసిన గంజాయి, కారు, రెండు బైక్‌లు, ఐదు ఫోన్లు స్వాధీనం. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
News October 14, 2025
సకాలంలో స్పందించిన విశాఖ పోలీసులు

కంచరపాలెంకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మహారాణిపేట పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కంచరపాలెంలో నివాసం ఉంటున్న యువతి ఇంట్లో కలహాల కారణంగా ఎవరికి చెప్పకుండా ఆర్కే బీచ్‌కి వచ్చి చనిపోవడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు112కు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీఐ దివాకర్ యాదవ్ స్పందించి గాలింపు చేపట్టగా బీచ్ రోడ్లో సాగర్ తీరం వద్ద ఉన్న యువతని కాపాడారు.
News October 14, 2025
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

AP: కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడును ఆనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఇవాళ ఏలూరు, కృష్ణా, NTR, పల్నాడు, GNT జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ భారీ వానలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరో 4 రోజులు కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది.