News January 23, 2025
ADB: తమ్ముడి అరెస్ట్ చేశామంటూ సైబర్ మోసం

ఆదిలాబాద్ 1 టౌన్లో సైబర్ క్రైమ్ కేస్ బుధవారం నమోదైంది. సీఐ సునీల్ కుమార్ కథనం ప్రకారం.. తిర్పల్లికి చెందిన అఫ్రోజ్ఖాన్కు ఈనెల 16న ఓ కాల్ వచ్చింది.. మీ తమ్ముడు తబ్రేజ్ అత్యాచారం కేసులో అరెస్టు అయ్యాడని.. అతడిని విడిపించుకోవాలంటే రూ.30వేలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. ఆయన వెంటనే వారి ఫోన్ నెంబర్లకు నగదు బదిలీ చేశాడు. తర్వాత తమ్ముడు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించి మోసపోయాడు.
Similar News
News October 31, 2025
2,790 మంది ఇండియన్స్ను US తిరిగి పంపింది: కేంద్రం

చట్ట వ్యతిరేకంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన ఇతర దేశస్థులను అమెరికా వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు US నుంచి 2,790 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీరంతా అక్కడ చట్టవిరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి నివసించారని పేర్కొన్నారు. అటు 2025లో ఇప్పటివరకు దాదాపు 100 మంది అక్రమవలసదారులను UK తిరిగి పంపిందని తెలిపారు.
News October 31, 2025
PRG: ఉ‘సిరి’కి భారీ డిమాండ్

పరిగి పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఉసిరికాయలకు చాలా డిమాండ్ పెరిగింది. కార్తీకమాసం కావడంతో కొనుగోళ్లు పెరిగాయి. దేవాలయాల్లో విష్ణువు, శివుడి వద్ద ఉసిరి దీపాలు వెలిగించడానికి మహిళలు, యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పరిగి మార్కెట్లో 250గ్రా. ఉసిరి రూ.30-50 అమ్ముతున్నారు. కాయ, ఆకులు గల ఉసిరి కొమ్మను రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
News October 31, 2025
నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ్టి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు కోరుతూ నేడు వెంగళరావునగర్, సోమాజీగూడ డివిజన్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. రేపు బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్పేట్-1, రహమత్ నగర్, 5న షేక్పేట్-2, యూసుఫ్గూడలో రోడ్ షో, 8, 9తేదీల్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో ఆయన రాత్రి 7 గంటల నుంచి ప్రచారంలో పాల్గొంటారు.


