News August 11, 2024
ADB: తాను మరణిస్తూ ఏడుగురి జీవితాల్లో వెలుగులు
తాను మరణిస్తూ ఏడుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు ఉద్యోగి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీకాంత్(35) 6న బైకుపై వెళ్తుండగా మంచిర్యాల వద్ద ట్రాక్టర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడటంతో ఎల్బీనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించగా 3 రోజుల తర్వాత చికిత్సకు స్పందించకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. విషయం తెలుసుకున్న జీవన్ ధాన్ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు అవయవ దానంపై అవగాహన కల్పించగా దానం చేశారు.
Similar News
News January 15, 2025
బెజ్జూర్: తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య
బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన కావిడె నవీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తండ్రి దేవయ్య ఇచ్చిన ఫిర్యాదు పై ఎస్సై ప్రవీణ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు నవీన్ను మందలించారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు..
News January 15, 2025
జాతీయస్థాయి పరీక్షలో నార్మూర్ అమ్మాయి ప్రతిభ
నేషనల్ మెటీరియాలజీ ఒలంపియాడ్ ఎర్త్ సైన్స్ అండ్ క్లైమేట్ ఛేంజ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షలో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన సోంకామ్లే సోని ప్రతిభ చాటింది. పరీక్షలో జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది. దిల్లీలో శాస్త్రవేత్తల చేతులమీదుగా అవార్డును అందుకుంది..
News January 15, 2025
NRML: శిశువు మృతదేహం లభ్యంపై దర్యాప్తు
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామంలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. SI శ్రీకాంత్ కథనం ప్రకారం.. అప్పుడే పుట్టిన మగ శిశువును కోమటి చెరువు సమీపంలో పడేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శిశువుకు 5 నుంచి 6 నెలల వయసు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.