News April 10, 2025

ADB: తులం బంగారం కోసం పెళ్లి పందిరిలో నిరసన

image

రాష్ట్ర ప్రభుత్వం నవ వధువుకు అందించే తులం బంగారం ఏదంటూ ఏకంగా ఓ పెళ్లి పందిరి లోనే నవ దంపతులు నిరసన వ్యక్తం చేసిన వినూత్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో గురువారం జరిగిన పెళ్లిలో నవ దంపతులు కాంబ్లె ఆమోల్ – గీతాంజలి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘రేవంత్ రెడ్డి గారు.. తులం బంగారం ఎక్కడ’ అంటూ ప్రశ్నించారు.

Similar News

News April 22, 2025

నేడు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ

image

AP: యూరప్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై చర్చిస్తారు. ఇది బీజేపీకే దక్కనుందని సమాచారం. అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌తోనూ ఆయన సమావేశమవుతారు.

News April 22, 2025

MNCL: పెళ్లి పేరుతో మహిళను లోబర్చుకున్న నిందితుడు అరెస్ట్: ACP

image

INSTAలో పరిచయమై ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి మహిళను లోబర్చుకున్న లక్షెట్టిపేటకు చెందిన పొన్నం వినయ్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు కేసు నమోదు చేయగా.. ఏసీపీ రత్నాపురం ప్రకాశ్ సాక్షులను విచారించారు. అలాగే మెడికల్, ఓరల్ సాక్ష్యాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

News April 22, 2025

నిర్మల్: హాల్‌టికెట్లు వచ్చేశాయ్..!

image

తెలంగాణ మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష సంబంధిత హాల్ టికెట్లు విడుదలైనట్లు కుంటాల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నవీన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు వెబ్సైట్లో పెట్టినట్లు వెల్లడించారు. విద్యార్థి యొక్క రిఫరెన్స్ ఐడీ, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈనెల 27వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు.

error: Content is protected !!