News April 10, 2025
ADB: తులం బంగారం కోసం పెళ్లి పందిరిలో నిరసన

రాష్ట్ర ప్రభుత్వం నవ వధువుకు అందించే తులం బంగారం ఏదంటూ ఏకంగా ఓ పెళ్లి పందిరి లోనే నవ దంపతులు నిరసన వ్యక్తం చేసిన వినూత్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో గురువారం జరిగిన పెళ్లిలో నవ దంపతులు కాంబ్లె ఆమోల్ – గీతాంజలి ప్లకార్డులతో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి గారు.. తులం బంగారం ఎక్కడ అంటూ మాట్లాడారు.
Similar News
News January 6, 2026
GWL: పారదర్శకతతో ఓటర్ జాబితా రూపొందిస్తాం- కలెక్టర్

ఓటరు జాబితాలో వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి పారదర్శకతతో ఓటరు జాబితాను రూపొందిస్తామని గద్వాల కలెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం ఐడిఓసి మందిరంలో మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు అభ్యంతరాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఓటరు జాబితా పై పరిశీలన చేయాలని అధికారులకు సూచించారు.
News January 6, 2026
IPL నుంచి ఔట్.. ముస్తాఫిజుర్‌కు పైసా కూడా రాదు!

క్రికెట్‌కు సంబంధం లేని కారణంతో <<18757751>>బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్<<>> IPLకు దూరమయ్యారు. విదేశీ ప్లేయర్లు టీమ్‌లో చేరిన తర్వాత/టోర్నీలో గాయపడితే ఫ్రాంచైజీ పరిహారం ఇస్తుంది. ఇన్సూరెన్స్ ద్వారా 50% చెల్లిస్తుంది. భారత చట్టపరిధిలోని IPLకు సంబంధించిన అంశం కావడంతో ఏ విదేశీ ప్లేయర్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ద్వారా పరిహారం పొందాలని ఆలోచన చేయరు. దీంతో ముస్తాఫిజుర్‌కు పైసా కూడా అందే ఛాన్స్ లేనట్టే.
News January 6, 2026
GNT: సభలే అడ్డాగా జేబుదొంగల హల్‌చల్..!

గుంటూరు జిల్లాలో ఇటీవల CM చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనల సందర్భంగా జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. భారీగా జనం తరలివచ్చే బహిరంగ సభలను ఆసరాగా చేసుకుని సెల్‌ఫోన్లు, పర్సులు కాజేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలకు వెళ్లాలంటేనే కార్యకర్తలు జంకుతున్నారు. వరుసగా కేసులు నమోదవుతున్నా, పోలీసులు ఇప్పటికీ దొంగలను గుర్తించలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


