News February 24, 2025
ADB: త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి..!

FEB 28 జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 9-12 వ తరగతి విద్యార్థులకు సైన్స్ ఇన్నోవేషన్స్ పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్‌కు FEB 23 చివరి రోజు అని డీఈఓ ప్రణీత తెలిపారు. FEB 27, 28 తేదీల్లో పరీక్షలు ఉంటాయన్నారు. గెలుపొందిన వారికి FEB 28న రాష్ట్రపతి భవనంలో బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.
Similar News
News March 19, 2025
ఉట్నూర్: యాక్సిడెంట్.. ఒకరి దుర్మరణం

ఉట్నూర్ మండలం ఘన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం రెండు బైకులు ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ జైనూర్ మండలం గూడ మామడ గ్రామానికి చెందిన కుమ్రా భక్కును రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గౌరు అనే మరోవ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎదురుగా బైక్‌ను ఢీ కొన్న చిచ్‌దరి ఖానాపూర్‌కు చెందిన వ్యక్తికి గాయాలతో చికిత్స పొందుతున్నాడన్నారు.
News March 19, 2025
ADB: రాష్ట్రస్థాయి జిజ్ఞాసలో మనోళ్లకే మొదటి స్థానం

ADBలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జిజ్ఞాసలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచారు. HYDలో జరిగిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వ పాలన శాస్త్రంలో “ఆరు గ్యారంటీల అమలుకు అవకాశాలు: ADBపై ఒక అధ్యయనం” అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బేగం వారిని అభినందించారు.
News March 19, 2025
ADB: ఐదుగురిపై కేసు నమోదు, అరెస్టు: DSP

యువత గంజాయి మత్తు బారిన పడకుండా తల్లిదండ్రులు వారిపై శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఇద్దరు గంజాయి అమ్మేవారు, ఒక గంజాయిని పండించేవాడు, ఇద్దరు గంజాయి తాగే వారున్నారని తెలిపారు. వీరి నుంచి 35 గ్రాముల గంజాయి, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.