News October 16, 2024

ADB: త్వరలో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క

image

చాలకాలంగా పెండింగ్లో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ సహా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని HYD సెక్రటేరియట్ సమావేశంలో పేర్కొన్నారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్​ మెంట్​ లెటర్స్​ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 5, 2024

ఆదిలాబాద్: KU ఫీజు చెల్లింపునకు రేపే ఆఖరు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రేపటితో ముగియనున్నట్లు KU అధికారులు తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 11 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

News November 5, 2024

నిర్మల్: బేస్ బాల్ ఆడుతూ తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి

image

నిర్మల్ మినీ ట్యాంక్ బండ్ పక్కన ఉన్న ఎంజేపీ పాఠశాలలో ఉదయం బేస్ బాల్ ఆడుతూ ఓ విద్యార్థి మృతి చెందాడు. 9వ తరగతి చదువుతున్న అయాన్(14) అనే విద్యార్థి వాలీబాల్ ఆడుతూ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. బాలుడి స్వగ్రామం దిలావర్పూర్ మండలం లోలం గ్రామం. ఫిట్స్ రావడంతోనే బాలుడు చనిపోయినట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

News November 5, 2024

బెల్లంపల్లి: ‘రాజకీయ అండతోనే భూకబ్జాకు ప్రయత్నం’

image

బెల్లంపల్లి పట్టణం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ సంజీవని హనుమాన్ దేవాలయ భూములను పరిరక్షించాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు రేవల్లి రాజలింగు మాట్లాడుతూ.. దేవాలయ భూముల కబ్జాకు దౌర్జన్యంగా రాజకీయ అండతోనే కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూముల కబ్జాకు ప్రయత్నిస్తున్న దుండగులపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.