News September 29, 2024

ADB: దసరా స్పెషల్.. RTC ఆధ్వర్యంలో 412 ప్రత్యేక బస్సులు

image

దసరా సెలవుల నేపథ్యంలో ఆదిలాబాద్ రిజియన్‌లోని వివిధ డిపోల నుంచి 412 ప్రత్యేక బస్సులను JBS నుంచి ప్రత్యేకంగా నడుపుతున్నట్లు ఆదిలాబాద్ RTC RM సొలొమాన్ పేర్కొన్నారు. Oct 1 నుంచి 11 వరకు ఆదిలాబాద్ డిపో-78, అసిఫాబాద్-73, బైంసా-11, మంచిర్యాల-125, నిర్మల్-120, ఉట్నూర్-5 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సులు OCT 1 నుంచి OCT 11 వరకు నడుస్తాయని పేర్కొన్నారు.

Similar News

News July 6, 2025

సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ADB SP

image

సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరాలకు గురైన
వారు 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల బారిన పడిన గంటలోపు ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టం జరిగిన వాటిని తిరిగి రప్పించే అవకాశం ఉంటుందన్నారు. గతవారం జిల్లాలో దాదాపు సైబర్ నేరాలపై 10 ఫిర్యాదులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.

News July 6, 2025

ADB: యువతులను వేధిస్తున్న యువకుడిపై కేసు

image

యువతులు, మహిళలను వేధిస్తున్న యువకుడి పై ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అనీస్ అనే యువకుడు స్థానిక రైల్వే స్టేషన్లో ఉన్న మహిళలు, యువతులను వేధించడంతో అతనిపై కేసు నమోదు చేశామని సీఐ కరుణాకర్ రావు తెలిపారు. సమాచారం అందుకున్న షీటీం సిబ్బంది రైల్వే స్టేషన్ చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

News July 6, 2025

ADB: సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు

image

ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన అభ్యర్థులకు HYDలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కొరకు
https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని ADB బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఈనెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు.