News January 27, 2025
ADB: నాగదేవుడు పాలు తాగుతాడనే విశ్వాసం.!

నాగోబాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెస్రం వంశీయులు గోదావరి నుంచి తెచ్చిన జలంతో నాగోబా దేవుడి విగ్రహాన్ని, ఆలయాన్ని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు, రాగి ముంతలో పాలు తెస్తారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటిని కొత్త టవల్తో కప్పి పుట్టపై ఉంచుతారు. అయితే నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది.
Similar News
News December 11, 2025
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 700+ సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 250+ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇండిపెండెంట్లు 150+ స్థానాల్లో గెలవగా.. BJP బలపరిచిన అభ్యర్థులు 50+ స్థానాల్లో విజయం సాధించారు.
News December 11, 2025
మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి: కలెక్టర్

పల్నాడు జిల్లాలో కాన్పు, తదనంతర మాతృ మరణాలను నిరోధించాలని కలెక్టర్ కృతికా శుక్లా వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా స్థాయి మాతృ మరణాల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు, గర్భిణుల ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా హైరిస్క్ ప్రెగ్నెన్సీలను గుర్తించి, క్షేత్రస్థాయి సిబ్బంది ముందుగానే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News December 11, 2025
VJA: భవానీ భక్తుల కోసం ప్రత్యేక లడ్డూ కౌంటర్లు

భవానీ దీక్ష విరమణ సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదాలను బాక్సుల్లో అందుబాటులో ఉంచారు. దీక్ష విరమణ తొలిరోజు గురువారం లడ్డూలు కొనుగోలు చేసిన భక్తులతో దుర్గగుడి ఈవో శీనా నాయక్ మాట్లాడారు. అధిక మొత్తంలో లడ్డూలు కౌంటర్లలో అందుబాటులో ఉండటం, కావలసినన్ని విక్రయించడంతో భవానీ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.


