News February 9, 2025
ADB: నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

ఆదిలాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. రూరల్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన మేకల రాములు పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ కు చెందిన సాజిద్ ఆటోలో ఎక్కి ఓ ఆసుపత్రి వద్ద దిగిపోయాడు. అయితే ఆటోలోనే తన బ్యాగును మరచిపోయాడు. ఆటో డ్రైవర్ బ్యాగును గమనించి వన్ టౌన్ లో అప్పగించాడు. సీఐ సునిల్ కుమార్ బాధితుడిని గుర్తించి ఆ బ్యాగును బాధితునికి అప్పగించి ఆటో డ్రైవర్ సాజిద్ ను అభినందించారు.
Similar News
News December 7, 2025
ఆదిలాబాద్: ‘COC సభ్యత్వానికి డబ్బులు ఇవ్వొద్దు’

ఆదిలాబాద్లోని వ్యాపారులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యత్వం పేరిట డబ్బులు ఇచ్చే అవసరం లేదని, ఇప్పటికే అమాయకుల నుండి డబ్బులు తీసుకున్న ఒక వ్యక్తి పై ఎస్పీకి ఫిర్యాదు చేశామని అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ మాటోలియా తెలిపారు. ఎవరైనా బాధితులు డబ్బులు ఇచ్చినట్లయితే తమకు సమాచారం అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న కార్యాలయానికి వచ్చి వివరాలు ఇవ్వాలన్నారు.
News December 7, 2025
బోథ్: ఎన్నికల్లో ప్రలోభాలకు గురికావద్దు: ఎస్పీ

రానున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం రాత్రి బోథ్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి ఆయన ప్రజలతో మాట్లాడారు. ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎవరి బలవంతం ఓటుపై ఉండకూడదని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికలను పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News December 7, 2025
ADB: ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

త్రైమాసిక తనిఖీలో భాగంగా శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్లో గల ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఆయన గోదాం చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, అర్బన్ తహశీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు పంచాపూల, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.


