News February 9, 2025
ADB: నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

ఆదిలాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. రూరల్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన మేకల రాములు పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ కు చెందిన సాజిద్ ఆటోలో ఎక్కి ఓ ఆసుపత్రి వద్ద దిగిపోయాడు. అయితే ఆటోలోనే తన బ్యాగును మరచిపోయాడు. ఆటో డ్రైవర్ బ్యాగును గమనించి వన్ టౌన్ లో అప్పగించాడు. సీఐ సునిల్ కుమార్ బాధితుడిని గుర్తించి ఆ బ్యాగును బాధితునికి అప్పగించి ఆటో డ్రైవర్ సాజిద్ ను అభినందించారు.
Similar News
News March 15, 2025
ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం డీపీఓ కార్యాలయ సమీపంలో ఆటో, యాక్టివా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో గాయాలైన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యాక్టివా పైన ప్రయాణిస్తున్న ఇద్దరు 15 ఏళ్ల బాలురుల తో పాటు మరో వ్యక్తి శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
News March 15, 2025
ఆదిలాబాద్ జిల్లాలో కత్తి పోట్ల కలకలం

ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం గూడ రాంపూర్‌లో శుక్రవారం రాత్రి కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఒక వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన మరో వ్యక్తి కూడా కత్తి పోట్లకు గురయ్యాడు. ఇద్దరిని రిమ్స్‌కు తరలించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సాయినాథ్ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తాగిన మత్తులో ఘర్షణ జరిగినట్లు సమాచారం.
News March 15, 2025
గ్రూప్-3లో బజార్హత్నూర్ వాసికి 74వ ర్యాంక్

గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఇందులో బజార్హత్నూర్ మండలానికి చెందిన బిట్లింగ్ లక్ష్మమన్, నీల దంపతుల కుమారుడు ఉదయ్ కుమార్ 74వ ర్యాంక్ సాధించారు. ఇటీవల గ్రూప్-2 లో ఫలితాల్లో సైతం ఉదయ్ కుమార్ సత్తా చాటాడు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఆయనకు కుటుంబ సభ్యులతో పాటు మండల వాసులు అభినందనలు తెలిపారు.