News March 25, 2025
ADB: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News March 31, 2025
ఆదిలాబాద్: 13వ రోజుకు చేరుకున్న దీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు పలు యువజన నాయకులు, వివిధ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.
News March 31, 2025
ADB: గ్రూప్-1లో అమరేందర్కు 149 ర్యాంకు

గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ప్రతిభ కనబరిచారు. స్థానిక దోబీ కాలనీకి చెందిన బండి అశోక్- లక్ష్మి దంపతుల కుమారుడు బండి అమరేందర్ 478.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 149 ర్యాంకు సాధించారు. మల్టీ జోన్- 1లో 76వ ర్యాంకు సాధించారు. గ్రూప్-1లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 31, 2025
ఆదిలాబాద్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్ను తేల్చనుంది. ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.